Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెంగాణ-ఉప్పల్
అనారోగ్యం బారిన పడిన పేదలను ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆదుకుంటూ వారి జీవితాలలో వెలు గులు నింపడం జరుగుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతిసుభాష్ రెడ్డి పేర్కొన్నారు. హబ్సిగూడలోని ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో చిల్కానగర్ డివిజన్‌కి చెందిన నాగమణి రూ.16వేలు, రోజా రూ.15వేలు, ఓబయ్య రూ.54,500లకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మరియు కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ బాధితులకు రూ.85,500ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లా డుతూ కష్టనష్టాలు ఎదురవుతున్నప్పటికినీ అనారో గ్యంతో బాధపడుతూ ఆస్పత్రులలో చికిత్స పూర్తి చేసుకుని ఆరోగ్యవంతులై ఇంటికి చేరుకున్న కుటుం బాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎలాంటి జాప్యం జరగకుండా అందజేయడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడు తూ 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా పేద ప్రజలను తన అక్కున చేర్చుకొని కాపాడుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవేందర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, కిరణ్ కుమార్ రెడ్డి, గరికె సుధాకర్,శ్రవణ్, కోకొంద జగన్, బింగి శ్రీనివాస్, మహమూద్, శివ, వినీష్ రెడ్డి, రెహమాన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.