Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సురవరం ప్రతాపరెడ్డి జీవితం ఆదర్శనీయం, నేటి తరానికి స్ఫూర్తి వంత మని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ సంగీత, నాటక అకాడమీ నిర్వహణలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి శత జయంతిని పురస్కరించుకొని ప్రముఖ నాటక రచయిత డాక్టర్ విజయభాస్కర్ రచించిన సురవరం ప్రతాపరెడ్డి జీవిత చరిత్ర నాటకం బి.ఎం. రెడ్డి దర్శకత్యంలో ప్రదర్శించారు. తొలి ప్రదర్శన కావటంతో నటుల్లో కొంత మంది తడబాటు పడ్డారు. ఈ సందర్భంగా జరిగిన సభకార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ సాహితీ వైభవాన్ని ఎలుగెత్తి చాటిన ప్రతాపరెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారని, రాజకీయాల్లో ఆయన పాత్ర విస్మరించలేమన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ.రమణ, కవి గోరేటి వెంకన్న , సాహితీవేత్త డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి, దేసిపతి శ్రీనివాస్, సాంస్కతిక శాఖ సంచాలకులు మామిడి హరికష్ణతో పాటు ఐక్య మెహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు రాజేంద్రప్రసాద్ హాజరు కావడం విశేషం. వేదికపై సురవరం రచించిన ఆంధ్రుల సాంఘీక చరిత్రను కన్నడలో డాక్టర్ శేష శాస్త్రి అనువాదం చేసిన గ్రంథాన్ని మంత్రి ఆవిష్కరించారు.త