Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆనాడు భారతదేశాన్ని దోపిడీి చేస్తున్న బ్రిటీిష్ పాలకులను వెళ్లగొట్టడం కొరకు క్విట్ ఇండియా ఉద్యమాన్ని దేశవ్యాప్తం గా నిర్వహించారని, ఈనాడు బీజేపీ పాలకులు ప్రజల సంపదను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షిం చాలని, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు గ్యారెంటీ చేయాలని, సీఐటీయూ ఆధ్వర్యంలో హయత్ నగర్ సర్కిల్ కార్మికులకు కరపత్రాలను పంపిణీ చేసినట్లు సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కీసరి నర్సిరెడ్డి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్మికులతో మాట్లాడుతూ ఆరోగ్య రంగానికి నిధులు పెంచి ప్రభుత్వ హాస్పిటల్ మెరుగుపరచాలని, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులకు అనుగుణంగా 21వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రపంచంలో డీజిల్, పెట్రోల్ రేట్లు తగ్గుతుంటే భారతదేశంలో రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? ఎవరి కోసం పెంచుతు న్నారు? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్ట్ 9న జరిగే రక్షణ దినాన్ని పాటించాల్సిందిగా కార్మికులకు, ప్రజలకు, రైతులకు విజ్ఞప్తి చేశారు.