Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివిజన్ 19లో ఐదుకోట్ల బిల్లు పెండింగ్ పనులను ఆపివేసిన కాంట్రాక్టర్స్
- చేసిన పనులకు పూర్తిస్థాయి బిల్లు ఇస్తాం : వాటర్ బోర్డు జీఎం శరీఫ్
నవతెలంగాణ-ఉప్పల్
గత సంవత్సర కాలం నుంచి డివిజన్ 19లో సుమారు రూ. 5 కోట్ల మేర పనులు చేసిన బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో కాంట్రాక్టర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని గురువారం జలమండలి కాంట్రాక్టర్స్ ఆధ్వర్యంలో వాటర్ బోర్డ్ అడిషనల్ జనరల్ మేనేజర్ జాన్ శరీఫ్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జలమండలి కాంట్రాక్టర్స్ మోహన్, రఘురాం, రాఘవేంద్రరెడ్డి, రామ్ రెడ్డి, చందు మాట్లాడుతూ.. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి పనులు పూర్తి చేశామని, గత సంవత్సర కాలం నుంచి ఎటువంటి బిల్లులు రాక అవస్థలు పడుతున్నామని తెలిపారు. కొత్త పనులకు పర్మిషన్ ఇవ్వాలని, జియో టాపింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు బిల్లులు విడుదల చేయాలని కోరారు దీనిపై వాటర్ బోర్డ్ జీఎం శరీఫ్ స్పందిస్తూ పూర్తి పనులకు బిల్లులు చెల్లిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, కాంట్రాక్టర్లు పనులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో వేణుగోపాల్, భాను ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.