Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్‌రావునగర్
చర్లపల్లి డివిజన్లో కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ పథకాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, కార్పొరేటర్ మధ్య విభేదాలు ఉన్నాయని అసత్య ప్రచారాలు చేయడాన్ని కాలనీ సంక్షేమ సంఘాలు తీవ్రంగా ఖండించాయని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి తెలిపారు. గురువారం చర్లపల్లి జైలు శ్రీగార్డెన్లో జరిగిన సమావేశంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. చర్లపల్లి కాలనీ సంక్షేమ సంఘాలకు సంబంధం లేకుండా ఏర్పాటుచేసిన గ్రూపులో 10 కాలనీలో ఉన్నాయని, తమకు ఎలాంటి సంబంధం లేదని, 50కి పైగా కాలనీలకు ప్రతినిధులు వెల్లడించారని చెప్పారు. టీఆర్ఎస్ కార్యక్రమాల్లో తిరుగుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. కార్పొరేటర్‌గా ఎంతో సేవచేస్తుంటే కాలనీ సంక్షేమ సంఘాల వద్ద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. మరోపక్క చర్లపల్లి ప్రాంతంలో భవన యజమానులవద్ద డబ్బులు డిమాండ్ చేసి మోసం చేయడమేగాక, వాటిని కూల్చి వేసిన తర్వాత కార్పొరేటర్ కూల్చివేయించినట్లు తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. తమ వద్ద డబ్బులు తీసుకున్నారనిబాధితులు నాయకుల పేర్లు బహిరంగంగా చెబుతున్నారని కార్పొరేటర్ తెలిపారు. తనను అవమాన పరచి తప్పుడు ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు, కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.