Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ-మేడ్చల్ రూరల్
నూతన్‌కల్ గ్రామంలోని ఆలయంవద్ద ఉన్న రావిచెట్టును అనుమతిలేకుండా నరికి వేసిన విషయంలో 'వందేళ్ల రావిచెట్టు నేలమట్టం' అని నవతెలంగాణలో వచ్చిన వార్తకు ఫారెస్ట్ అధికారులు, తహసీల్దార్ స్పందించి చర్యలకు సిద్ధమయ్యారు. వివరాలు సేకరించి నివేదిక ఇవ్వాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీదేవి మేడ్చల్ ఫారెస్ట్ బీట్ అధికారి సుదర్శన్‌రెడ్డిని ఆదేశించడంతో ఆయన గ్రామంలో పర్యటించి చెట్టు నరికివేసిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అధికారులకు నివేదిక అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ అధికారి ఎల్.శ్రీనివాస్ రెడ్డి, వాచర్ టీ. నర్సింహ తదితరులు పాల్గొన్నారు. చెట్టును తొలగించిన వ్యక్తికి రెవెన్యూ చట్టం ప్రకారం నోటీసులు అందజేశామని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ గీత తెలిపారు.