Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కాలనీ అభివృద్ధికి సంక్షేమ సంఘాల నాయకులు పాటుపడాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎరోనాటిక్స్ సంక్షేమ సంఘం నాయకులు, భద్రసాయి నగర్ సంక్షేమ సంఘం నాయకులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా గురువారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ సంఘం సభ్యులు ఐకమత్యంతో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామన్నారు. నాయకులు కుంట సిద్దిరాములు, భద్రసాయి నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు యాకయ్య, ఉపాధ్యక్షులు నాగభూషణం, జనరల్ సెక్రటరీ కోటేశ్వర్రావు, జాయింట్ సెక్రటరీ సాయిలు, మునికిరణ్, కోశాధికారి మాణిక్యం, ఎరోనాటిక్స్ సంక్షేమ సంఘం అధ్యక్షులు కనకయ్య, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి అమర్నాథ్, ఉపాధ్యక్షులు ముకుందరావు, ప్రసాద్‌రావు, భగవాన్‌దాస్, జాయింట్ సెక్రటరీలు నరేందర్‌రెడ్డి,శ్రీనివాస్, అడ్వైజర్లు భిక్షపతి, రవీందర్, సోమిరెడ్డి, సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ సభ్యులు హనుమంతరావు, శ్రీనివాస్‌మూర్తి, కృష్ణ పాల్గొన్నారు.
వైద్యుల సేవలు అభినందనీయం
కరోనా ప్రమాదకర పరిస్ధితిలో వైద్యుల సేవలు అభినందనీయమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కొంపల్లి బ్రాంచ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటైన సందర్భంగా గురువారం ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ భర్మ వెంకటేశ్వర్రావు, అధ్యక్షులు ఎలక్ట్ డాక్టర్ వంశీకొండ్లే, ఉపాధ్యక్షులు డాక్టర్ రజినీ అశోక్, హనరరీ సెక్రటరీ డాక్టర్ శరత్చంద్ర, సెక్రటరీ డాక్టర్ శైలజ ప్రకాష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ డాక్టర్ భాస్కర్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ గంగిరెడ్డి, డాక్టర్ ఎంఎస్‌రెడ్డి, డాక్టర్ ప్రకాష్, డాక్టర్ కిరణ్గ్రంధీ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై ప్రత్యేక శ్రద్ద
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, నాయకులు ఆయన నివాసంలో ఎమ్మెల్యేను గురువారం మర్యాద పూర్వకంగా కలిసి సమస్యలను వివరించారు.