Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
వాట్సాప్ చాటింగ్లో తెలంగాణ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అవమానపరిచే పదజాలాన్ని వాడిన కొండవీటి మధుసూదన్ రెడ్డి ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తూ టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలు, ప్రధాన కార్యదర్శి గదరాజు చందు ఆధ్వర్యంలో గురువారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఈటల రాజేందర్ దిష్టిబొమ్మను తగులబెట్టారు. అనంతరం డా.బండారి వీరబాబు, డా.వల్లమల కృష్ణ, డా.మంద సురేష్, దళిత విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ఓయూ పోలీస్ స్టేషన్లో ఈటల రాజేందర్, వారి కుటుంబ సభ్యులు, బావమరిది కొండవీటి మధుసూదన్ రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు పెట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శులు పడాల సతీష్, ఎరవెళ్లి కష్ణ, సమ్మె భాస్కర్ యాదవ్, జిల్లా నాగయ్య, జంగయ్య, ప్రశాంత్, నరేష్, మదన్, ఓయూ స్కాలర్లు బొల్ల ప్రవీణ్, పులుమద్ది సత్యనారాయణ, వేల్పుకొండ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.