Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధి యంనంపేట్ రెండవ వార్డు పరిధిలోని సాయితేజ కాలనీలో సీసీి రోడ్డు, రాజీవ్ గృహకల్ప కాలనీ 10వ వార్డు పరిధిలో ఓపెన్ జిమ్ పార్కును చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి గురువారం ప్రారంభిం చారు. అనంతరం అన్నానగర్ 13వ వార్డు పరిధిలోని సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ పథకాలలో తెలంగాణ రాష్ట్ర దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, నేడు దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం చేపట్టారని అన్నారు. నేడు మున్సిపాలిటీలు గ్రామాలు అభివృద్ధి పథంలో ముందకు సాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు గొంగళ్ళ మహేష్, నర్రి ధనలక్ష్మీ, చింతల రాజశేఖర్, సింగిరెడ్డి సాయిరెడ్డి, బాలగోని వెంకటేష్‌గౌడ్, మెట్టు బాల్‌రెడ్డి, సామల శ్రీలత, ఆకిటి శైలజ, భైరహిమ, సుర్వి సుధాలక్ష్మీ, సుర్వి రవీందర్, కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అక్రమ్ ఆలీ, దాసరి శంకర్, బాలగోని శకుంతల, టీిఆర్‌ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షుడు గొంగళ్ళ బాలేష్, ప్రధాన కార్యదర్శులు నల్లవెల్లి శేఖర్, కొమ్ముల ప్రశాంత్, మాజీ ఉపసర్పంచ్ ఆకిటి బాల్‌రెడ్డి, నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, పోలగోని శివకుమార్ గౌడ్, నర్రి కాశయ్య, మోటుపల్లి శ్రీనివాస్, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, పోలగోని సాయినాథ్ గౌడ్, పద్మారావు, మిసాల రాజేష్, జి.శేఖర్, బుచ్చిరెడ్డి, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.