Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లిఫ్టు నిర్వహణలో ఆస్పత్రి యాజమాన్య నిర్లక్ష్యమే కారణం ?
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, మాజీ కార్పొరేటర్ మందముళ్ల పరమేశ్వర్‌రెడ్డి, ఉప్పల్ నల్లచెరువు, సమీపంలో శ్రీ హెల్త్ కేర్ ఆసుపత్రి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి వెళుతుండగా ఎమ్మెల్యే తదితరులు లిఫ్టులో పైకి వెళ్తిన్నారు. అది కాస్తా పెద్ద శబ్దంతో ఒక్కసారిగా కుప్ప కూలడంతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. తేరుకొని చూసేసరికి మేయర్ బుచ్చిరెడ్డి, మరి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది లిఫ్ట్ తలుపులను తెరిచి అందరినీ బయటకు తీసుకొచ్చారు. కాగా ఈ ప్రమాద సంఘటనలో ఎమ్మెల్యేతో పాటు అందరు సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. ఉప్పల్ నల్లచెరువు సమీపంలో ఏర్పాటుచేసిన శ్రీ హెల్త్ కేర్ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న విమర్శలు ఈ ఘటన తర్వాత వెల్లువెత్తున్నాయి. పేషెంట్లవద్ద వేలకు వేలు బిల్లులు వసూలు చేయడంలో చూపే ఆసక్తి, ఆస్పత్రి నిర్వహణ, లిఫ్టు నిర్వహణలో ఏమైందని ఆస్పత్రి వద్దకు వచ్చిన పలువురు బహిరంగంగానే చర్చించుకున్నారు. లిఫ్టును నాసిరకంగా ఏర్పాటు చేయడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈ ఘటన జరిగిందన్న అనుమానాలు అందరూ వ్యక్తం చేస్తున్నారు.