Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రికి వినతి
నవతెలంగాణ-అడిక్‌మెట్
పంచాయతీరాజ్, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ కష్ణయ్య డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహాయ మంత్రి కపిల్ మొరేశ్వర్ పాటిల్‌ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం కష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత లేకపోవడంతో కోర్టులు పదే, పదే జోక్యం చేసుకొని రిజర్వేషన్లు తగ్గిస్తున్నారన్నారు. ఇటీవల తెలంగాణలో 34 నుంచి 22 శాతానికి తగ్గించారన్నారు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టి, జనాభా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నేతలు గుజ్జ కష్ణ, లాకా వెంగల్ రావు, నీల వెంకటేష్, లాల్ కష్ణ, నుకనమ్మ, నాగేశ్వర్ రావు, బోను దుర్గా నరేష్, భుపేష్ సాగర్, బర్క, కష్ణ, అనంతయ్య, నంద గోపాల్, కె.నర్సింహ గౌడ్, %=%ద్రశేఖర్ గౌడ్, చంటి ముదిరాజ్, ఉదరు, పగిల్ల సతీష్, బబ్లు గౌడ్, వికీల్, జక్కు సంజరు. టైరు నరేష్ గౌడ్, ఉదరు, బట్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.