Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో చలో హుజురాబాద్ చేయాలి
- టీఏపీఆర్పీఏ అధ్యక్షులు కృష్ణమూర్తి
నవతెలంగాణ-మలక్ పేట్
పెంచిన పెంచిన పదవి విరమణ వయస్సు జులై 2018 నుంచి అమలు చేయాలి అని తెలంగాణ అల్ పెన్షనర్స్ రిటైడ్ పర్సన్స్ అసోసియేషన్ (టీఏపీ ఆర్పీఏ) అధ్యక్షులు పాలకుర్తి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. శుక్రవారం ఆర్కె పురం డివిజన్ చిత్రా లేఔట్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో టీఎస్ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2018 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చిందనీ, ఆ హామీని నెరవేర్చాలన్నారు. కేంద్ర ప్రభుత్వ సీపీసి మాదిరిగా అమలు తేదీ ఒకే విధంగా ఉండాన్నారు. 1.7. 2018 నుంచి 31.3.2020 వరకు రిటైర్ వారికి పెంచిన గ్రాడ్యూటీ డిఫెరెన్సు లీన్ ఎన్కాష్మెంట్ను వర్తింపజేయాలన్నారు. 20 ఏండ్లు సర్వీస్ వాళ్లకు ఫుల్ పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. 61 ఏండ్ల సర్వీస్ తమకు కూడా కల్పించాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు మేకల లింగయ్య, కూరపాటి నాగేశ్వరావు, సీతారామ్, అరుణ, యూసుఫ్ అలీ, బ్రహ్మచారి, రంగారెడ్డి, సతీష కుమార్, సుకన్య, నారాయణరెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు.