Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాల యంలో హౌమ్ కంపోస్టింగ్‌పై డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు ట్రైనింగ్ ఇచ్చినట్టు మేయర్ జక్కా వెంకట్‌రెడ్డి తెలిపారు. ట్రైనింగ్‌లో భాగంగా కంపోస్టింగ్ ప్రాముఖ్యత, పద్ధతులు, కంపోస్టింగ్ ప్రయోజనాలు, ఉపయోగాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ట్రైనింగ్ ముఖ్య ఉదేశం పీర్జాది గూడ కార్పొరేషన్‌లోని ప్రజలు ఎవరింట్లో వారు హౌమ్ కంపోస్టింగ్ ఎలా చేయాలో వివరించినట్టు తెలి పారు. సీడీఎంఏ ఆదేశానుసారం ట్రైనింగ్ నిర్వహించి నట్టు తెలిపారు. పైలట్ ప్రాజక్టు క్రింద పీర్జాదిగూడ కార్పొరేషన్‌ను ఎన్నుకన్నందుకు ప్రభుత్వం, కంపోస్టింగ్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఎం.శ్రీనివాస్, స్టేట్ అర్బన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ స్పందన, డిస్టిక్ట్ మిషన్ కో-ఆర్డినేటర్ అనిల్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ జగన్ మోహన్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ బాల మురళి, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.