Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్నగర్
మానవ అక్రమ రవాణాను రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమ రవాణాను నివారించడమేగాక, సెక్స్ రాకెట్స్ ఉచ్చు నుంచి చాలామంది విదేశీ, స్వదేశీ మహిళలను కాపాడటంలో రాచాకొండ పోలీసులు ఎంతో బాగా పనిచేశారని, తాము అందిస్తున్న సేవలతో దేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించామని రాచకొండ పోలీస్ కమిషనర్, అడిషనల్ డీజీ మహేశ్ మురళీధర్ భగవత్ అన్నారు. శుక్రవారం రాచకొండ కమిషనరేట్లో ప్రపంచ మానవ అక్రమ రవాణ దినం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అక్రమ రవాణా నిందితుడి వివరాలను కూడా వెల్లడించారు. ఆన్లైన్లో ఆప్రికన్ గర్ల్స్ అందుబాటులో ఉన్నారని టోలీచౌకీ ప్రాంతానికి చెందిన యువతి రాకెట్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ రాచకొండ పోలీసులు యుగాండకు చెందిన నముబిరు సైనా 2017లో ఢిల్లీలో బట్టల దుకాణం నిర్వహిస్తూ ఉండేది. ఆతర్వాత వీసా ముగిసినా కూడా అక్కడి నుండి హైదరాబాద్ నగరానికి వచ్చి టోలిచౌకిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని విదేశాల నుండి యువతులను పిలిపించుకుని వ్యాభిచారం నిర్వహిస్తుండేది., బాధితుల ఫిర్యాదుతో బాలాపూర్ చౌరస్తాలో ఈనెల 29న ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై పీడి యాక్టు కూడా నమోదు చేయనున్నారు.
2016 జూలై 1నాటికి 5ఏండ్లు పూర్తి చేసుకున్న రాచకొండ కమిషనరేట్ బాధితులకు సత్వర న్యాయం చేకూరుస్తోంది. వ్యభిచారం ముఠాలకు సంబంధించి 353 కేసులు నమోదు చేసి, 308 మంది పురుషులు, 314 మంది స్త్రీలను అరెస్ట్ చేసి 584 మందికి విముక్తి కల్పిచామని, దానికి తోడు బంగ్లాదేశ్, ఇతర దేశాల్లో కూడా మిస్సింగ్ కేసులను సైతం చేధించామన్నారు. ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ ద్వారా ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న మైనర్లకు విముక్తి కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపామని, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్ల సాయంతో మరెన్నో కేసులు ఛేదించామని వివరించారు.7 కేసుల్లో శిక్షలు పడ్డాయని, ఈ ఐదేండ్లలో 62 మంది బాధితులకు విముక్తి కల్పించినట్లు తెలిపారు. ఆయన వెంట ఎస్ఓటీ డీసీపీ సురేందర్ రెడ్డి,హ్యుమన్ ట్రాఫికింగ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్,ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి,ఏఎస్ఐ గోవర్ధన్ సిబ్బందికి నగదు రివార్డులను అందజేశారు.