Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హరునగర్
ట్రావెలింగ్ ఏజెంట్‌గా పనిచేసి, అధిక డబ్బుల కోసం ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో బాధితులను మోసం చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ మహేశ్ మురళీధర్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన తారా బహదూర్ 2018లో ట్రావెలింగ్ ఏజెంట్‌గా పనిచేసేవాడు. ఆ తర్వాత ఆశించదగ్గ లాభాలు రాకపోవడంతో ఆన్లైన్లో రూ. 100 పెట్టుబడి పెడితే దానికి రెట్టింపు నగదు ఇచ్చే వాడు. అలా బాధితులను ఎరగా వాడుకుని ఆతర్వాత ఆన్లైన్ ప్రెండ్ షిప్ చేసి నాన్‌బ్యాంకింగ్ అయినందున చాలా మంది వద్ద నుండి తన ఖాతాల్లో డబ్బులు వేయించుకుని జల్సాలు చేసేవాడు. ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్‌పై ఢిల్లీలో అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఆధార్, పాన్ కార్డులు, ఒక ఫోన్, 2సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చెందిన మహింద్రా కొటక్ బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 3,00,121 నగదును సీజ్ చేసి, అతనిని రిమాండ్‌కు తరలించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్, ఇన్స్పెక్టర్ వెంకటేశ్‌లు ఉన్నారు.