Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి నాగేందర్
నవతెలంగాణ-ధూల్‌పేట్
కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అందించిన సేవలు ఎనలేని ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి నాగేందర్ అన్నారు. ఈమేరకు శుక్రవారం ఫ్రంట్‌లైన్ వారియర్లను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్ రోగులకు సేవలందించారన్నారు. ఈసందర్భంగా ఉస్మానియా ఆస్పత్రి ఆరోగ్య సంరక్షణ సంస్కరణల వైద్యుల సంఘం, జనరల్ మెడిసిన్ విభాగం, అనస్థీషియా ఫ్యాకల్టీ, సీనియర్, జూనియర్ నివాసితులు, సూపరింటెండెంట్, ఆర్ఎంఓఎస్డీ, హెచ్ఓడీ జనరల్ మెడిసిన్ డాక్టర్ బాలరాజు, టీజీడీఏ అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్, యూనిట్-1 ఆస్పత్రి ప్రెసిడెంట్ డాక్టర్ రామ్ సింగ్, హెచ్ఆర్డీఏ ప్రతినిధులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ శ్రీకాంత్, ఫ్యాకల్టీ, రెసిడెంట్స్ సభ్యుల సేవలను కొనియాడారు. అనంతరం విధి నిర్వహణలో వైద్య సేవలందిస్తూ, సహకరించిన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్రను సభ్యులు సన్మానించారు