Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్మ సంఘానికి ఐదు ఎకరాల స్థలం కేటాయించడంపై కేపీహెచ్‌బీ కమ్మ సంఘం సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. ఈమేరకు శుక్రవారం కేపీహెచ్‌బీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావుతో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరును ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు నాగేశ్వరరావు, ప్రభాకర్, రామారావు, వాసు, గంగూర్ శ్రీనివాసరావు, భూషయ్య, రాంగోపాల్, మల్లికార్జున్‌రావు, వెంకటేశ్వరరావు, సాంబశివరావు, శంకర్, శివరామకృష్ణ, శ్రీరాం, కృష్ణార్జున్, రమేష్, విఎన్వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.