Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నర్సింహారావు
నవతెలంగాణ-మీర్పేట్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని సీపీఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ నర్సింహా రావు అన్నారు. ఇటువంటి ప్రభుత్వం ఉండేకంటే దిగిపోవడం మంచిదన్నారు. శుక్రవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆ పార్టీ శాఖ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తోందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేదలపై భారాలు మోపుతోందని, ఉపాధి అవకాశాలు చూపడంలో విఫలమైందని అన్నారు. ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు చంద్రమోహన్, గోరెంకల నర్సింహా, సీపీఐ(ఎం) బాలాపూర్ మండల బాధ్యులు జి.అశోక్, నాయకులు దాసరి బాబు, యాదగిరి, రాజు, ధనుంజరు, మస్తాన్ బి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.