Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
శ్రమ దోపిడికి గురవుతున్న సంఘటిత, అసంఘటిత కార్మికులు సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. శుక్రవారం షాపూర్‌నగర్‌లో సీఐటీయూ నూతన జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీనియర్ నాయకులు బీఎన్ సుదర్శన్‌తో కలిసి జెండాను ఆవిష్కరించారు. సీఐటీయూ నాయకులు కిలుకాని లక్ష్మణ్ అధ్యతన జరిగిన సమావేశంలో భాస్కర్ మాట్లాడుతూ ఆగస్టు 9వ తేదీని భారతరక్షణ దినంగా పాటించాలన్నారు. కార్మికులంతా కలిసి ఉండి ఐక్యపోరాటాలు చేయాలన్నారు. దేశంలో కార్మిక వ్యతిరేక విధానాలతో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వానికి కార్మికులు తగిన బుద్ది చెప్పాలన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని, లేబర్ కోడ్, విద్యుత్ చట్ట సవరణను అపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పెరిగిన ధరలతో కార్మికులు, దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తగ్గించి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారస్లకు అనుగుణంగా కనీస వేతనం రూ.21 వేలు నిర్ణయించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె.చంద్రశేఖర్, జిల్లా అధ్యక్షులు ఎ.అశోక్, జిల్లా నాయకులు ఐ.రాజశేఖర్, లింగస్వామి, ఈశ్వర్, బీరప్ప, దేవదానం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.