Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోడుప్పల్ నగర మేయర్ సామల బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
పేదవారి కడుపు నింపడమే టీఆర్ఎస్ సర్కారు లక్ష్యమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నాయని బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. శుక్రవారం 27వ డివిజన్ లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, పారిశుధ్య సిబ్బందికి రక్షణ రక్షణ పరికరాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారు అంటేనే సంక్షేమ పథకాలకు కేరాఫ్ అడ్రసుగా మారిందన్నారు. కార్పొరేషన్ పరిధిలో నూతనంగా 1217 రేషన్ కార్డులు మంజూరైనట్లు తెలిపారు. మరికొంతమంది లబ్ధిదారులకు దశలవారీగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ బోడుప్పల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, స్థానిక కార్పొరేటర్ బందారపు అంజలీదేవి శ్రీధర్ గౌడ్, సహకార బ్యాంకు డైరెక్టర్ జడిగే రమేష్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త చక్రపాణి గౌడ్, కాటపల్లి రాంచంద్రారెడ్డి, మీసాల కృష్ణా, జె.రాములు, కృపసాగర్ ,ఉప్పరి విజరు,నవోదయ యువజన సంఘం అధ్యక్షుడు మన్నె ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి ఎర్రగుడ్ల సత్యమూర్తి యాదవ్ పాల్గొన్నారు.