Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరికీ విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలి : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎన్.మూర్తి
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
విద్యార్థి ఉద్యమ బలోపేతానికి ఎస్ఎఫ్ఐ కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్.ఎన్.మూర్తి అన్నారు. శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గ మొదటి మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజ కవర్గంలో విద్యా రంగం బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలన్నారు.రాష్ట్ర, కేంద్ర ప్రభు త్వాలు విద్యారంగాన్ని కార్పొరే టుకు అప్పజెప్పే కుట్రలు చేస్తున్నాయనీ, ప్రభు త్వ విద్యాసంస్థల మూసివేతతోనే కార్పొరేట్ల బానిసగా మారిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఎస్ఎఫ్ఐపై ఉంద న్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో కనీసం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ఏడేండ్ల టీఆర్ఎస్ పాలనలో ఎలాం టి కృషి జరగలేదన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల ను ఏర్పాటు చేస్తే పేదవాడు ఉన్నత స్థాయికి ఎదుగుతారనీ, కేవలం డబ్బు ఉన్నవాళ్లు మాత్రమే చదువుకోవాలి పేదవాడు బానిసగా ఉండాలనే దక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే హైటెక్ సిటీ, మాదాపూర్లో రంగుల బంగళాలు కాదనీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం, కనీస అవసరాలు తీర్చే ప్రభుత్వాలు కావాలన్నారు. టీఆర్ఎస ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య అని చెప్పి పాఠశాలల మూసివేత ఎందుకు చేస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను కేవలం ఉపఎన్నికలు అప్పుడే తప్పా మళ్లీ దాని వైపు కన్నెత్తి కూడా చూడని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో నెంబర్ వన్ అని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలన వల్ల రాష్ట్ర అభివృద్ధి వెనకపడుతుందనీ, వాళ్ళ రాజకీయ పదవుల కోసం కాంట్రాక్టులను కాపాడుకోవడం కోసం అప్పుల మీద అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా చేస్తున్నారని విమర్శించారు. ఎస్ఎఫ్ఐ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి పడాల శంకర్ మాట్లాడుతూ 75 ఏండ్ల స్వాతంత్రం కడుపు నింప లేని పరిస్థితికి దిగజార్చిన రాజకీయ నాయకులకు అభినంద నలు తెలియజేస్తూ స్వతంత్రం అనేది రాజకీయ నాయకుల కాదు కావాల్సింది, ఆకలి, పేదలకు, విద్య, వైద్యం, ఆకలి చావులకు విముక్తి స్వాతంత్రం కావాలని తెలిపారు.
ఉప్పల్ నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక..
అధ్యక్ష కార్యదర్శులుగా కాసిం అఖిల, ఉపాధ్య క్షులుగా మణికంఠ, సాయి ఉత్తేజ్, చందన, పుష్ప, సహాయ కార్యదర్శులుగా శివ, శిరీష, కమిటీ సభ్యులుగా ధరణి, జగదీష్, కో ఆప్షన్ మెంబర్లను ఎన్నుకున్నారు.