Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-అల్వాల్
అల్వాల్ సర్కిల్ పరిధిలోని శ్రీ లక్ష్మీ నగర్ ఓల్డ్ ఆల్వాల్‌లోని అల్వాల్ కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షించారు. వర్షపు నీరు దిగువ ప్రాంతంలోకి వెళ్ళలేక ఇండ్ల లోనికి వచ్చి ఇబ్బందులకు గురి అవుతున్నారనీ, నీరు బయటకు వెళ్లేలా చేయాలని కాలనీవాసులు తెలిపారు. కాలనీ ముందు ప్రాంతంలో బస్ స్టాపు ఏర్పాటుకు కొత్తగా డ్రయినేజీ లైన్లను వేసి సీసీ రోడ్లు వేయాలనీ, తాగునీరు ప్రజలకు అందుబాటులోకి తేవాలనీ, పలు సమస్యలను కాలనీ వాసులు తెలిపారు. కార్పొరేటర్ ఏఈ లక్ష్మీ స్పందించి కాలనీలో ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శివ, శరణప్ప, జైపాల్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్, రామకృష్ణ, లింగారెడ్డి, శివరాజ్, నారాయణ, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.