Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
రాష్ట్రంలోని దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈసిఐఎల్ లోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి సోమ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 16 షెడ్యూలు కులాల రిజర్వుడ్ నియోజక వర్గాలు ఉన్నాయనీ, కనీసం ఆ 16 నియోజకవర్గాల్లోనైనా దళిత బంధు పథకం అమలు చేయకుండా దళితుల ఆత్మగౌరవంతో సీఎం కేసీఆర్ ఆడు కుంటున్నారని విమర్శించారు. శాసన సభ్యులందరూ రాజీనామా చేసే విధంగా దళితులు ఒత్తిడి తేవాలని సూచించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోనే దళిత బంధు అమలు చేస్తామనీ, ఇది ఎన్నికల స్టంట్ అని ఒక సీఎం పేర్కొనడం విచిత్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలనూ సమానంగా చూడాల్సిన సీఎం ఒక ప్రాంతానికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాముఖ్యత ఇవ్వడంలోనే రాజకీయం ఏమిటో అర్థం అవుతుంద న్నారు. కల్లబొల్లి మాటలతో ప్రజానీకాన్ని మభ్యపెడు తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. దళితులంతా ఐక్యమై దళిత బంధు సాధించుకోవడం కోసం తమ పోరాటంలో భాగస్వా ములు కావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయ కులు గడ్డం యాదగిరి, టిల్లు యాదవ్, బీఎస్టీ సాయి కుమార్, పంజాల బాబుగౌడ్, కమలాకర్, పాల్గొన్నారు.