Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 21 అంశాల ఎజెండాతో ప్లాన్
వీసీ ప్రొ. రవీందర్ యాదవ్నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రాబోయే మూడేండ్లలో రాష్ట్రంలో, దేశంలోనూ రోల్ మోడల్‌గా చేయబోతున్నామని ఓయూ వైస్ చాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఓయూ అతిథిగహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనివర్సిటీని ప్రతిష్టం చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక రూపొందించామని, అందులో ప్రధానంగా 21 అంశాలు ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తున్నామన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో మార్పులు చేయబోతున్నామని, మార్కెట్లో డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను రూపొందించనున్నట్లు చెప్పారు. సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరిశోధనలపై ప్రత్యేకమైన దష్టి పెడతామని, దీనికోసం రిటైర్డ్ ప్రొఫెసర్ సేవలను వినియోగించుకుంటామని చెప్పారు. నూతనంగా 500 మంది విద్యార్థులు పట్టేలా ఓయూలో ఒక లైబ్రరీలో హాల్, సెంటినరీ మెమోరియల్ భవనం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ డిజిటల్ లైబ్రరీని బలోపేతం చేసేందుకు కషి చేస్తున్నామన్నారు. ప్రధానంగా ఓయూను క్లోజ్డ్ క్యాంపస్‌గా తయారు చేస్తామన్నారు.
అక్టోబర్‌లో స్నాతకోత్సవం
అక్టోబర్‌లో స్నాతకోత్సవం నిర్వహిస్తున్నామని, 3 కేటగిరీలుగా అధ్యాపకులకు అవార్డ్స్ ఇస్తున్నట్లు చెప్పారు. క్లాస్రూమ్ వాతావరణం పెంపొందించి, సెల్ట్ను బలోపేతం చేసి ఆంగ్ల భాషలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రధానంగా రిఫామ్స్, ట్రాన్స్ఫామ్, పెర్ఫామ్ అనే నినాదంతో ముందుకు సాగానున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొ. పప్పుల లక్ష్మీనారాయణ, ఓఎస్డీ ప్రొ. రెడ్యా నాయక్, కంట్రోలర్ ప్రొ శ్రీరాం వెంకటేష్, పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొ. పాండు రంగా రెడ్డి, ప్రొ..స్టీవెన్ సన్, పీఆర్ఓ డా.సుజాత పాల్గొన్నారు.