Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీనగర్
ముస్లిం కమ్యూనిటీని తెలంగాణ ఉద్యమం వైపు అడుగులు వేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు అబ్రార్ హుస్సేన్ ఆజాద్ ఈపార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లో 2003 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నప్పటికీ పార్టీలో గుర్తింపు ఇవ్వలేదని, తన శ్రేయోభిలాషులు, అనుచరులు సూచించడంతో రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మైనార్టీ సంక్షేమ పథకాలు అమలు శూన్యం అన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఒక వైపు బడ్జెట్ లేక మరోవైపు అధికారుల, సిబ్బంది కొరతతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు.ఉపముఖ్యమంత్రిగా మహమూద్ అలీ ఉన్నప్పటికీ ఆయన కేసీఆర్ చేతిలో కీలుబొమ్మ అయ్యారన్నారు. గురుకుల మైనార్టీ పాఠశాలలో కొంత అభివద్ధి జరిగింది అంటే దానికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసమే ఇటీవలే రాజీనామా చేసి ప్రజల్లోకి వస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తెలంగాణలో బడుగుల జీవితాల్లో వెలుగులు నింపాలని వస్తున్న ప్రవీణ్ కుమార్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.