Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని సోషల్ మీడియా వేధికగా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆధార్, ప్యాన్కార్డ్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌లోని రూ.3,00121 డబ్బులు ఫ్రీజ్ చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ మహేష్‌భగవత్ తెలిపిన వివరాల మేరకు నేపాల్‌కు చెందిన తారా బహద్దూర్ న్యూ ఢిల్లీలో నివాసముంటున్నాడు. ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేస్తున్న నిందితుడు ఆన్లైన్లో స్నేహితుల ద్వారా సైబర్ నేరాలపై అవగాహన పొందాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్‌మీడియా ద్వారా అమాయకులను టార్గెట్ చేయడం మొదలు పెట్టాడు. రూ.500, 1000 రూపాయలు పెట్టుబడుతలతో లక్షలు సంపాదించ వచ్చిని నమ్మిస్తున్న నిందితులో లక్షల్లో దండుకున్నాడు. కమీషన్లపై బ్యాంక్ అకౌంట్లను అమాయకుల నుంచి సేకరించాడు. రాచకొండ పరిధిలో పలువురిని మోసం చేయడంతో బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన సైబర్‌క్రైమ్ పోలీసులు న్యూ ఢిల్లీలో నిందితుడిని అరెస్టు చేవారు.