Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లల పెండ్లిలకు అండగా నిలుస్తున్నారని, మన ముఖ్యమంత్రికి మనమెంతో రుణపడి ఉన్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ అయ్యప్ప గుడి ఆవరణంలో శనివారం మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మున్సిపాలిటీ పరిధిలోని 27మంది కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్ అబ్దిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ముఖ్యమంత్రి మన కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని అందులో కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ ఒకటని అన్నారు. ఈ పథకం ద్వారా ఎంతో మంది లబ్దిపొందారని తెలిపారు. కొత్తగా దళితల అభివృద్దికి దళిత బంధు పథకం తీసుకువస్తున్నారని, దానికి నేడు విధి విధానాలు రూపొందించబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ విజయలక్ష్మీ, వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, పిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్‌గౌడ్, కమిషనర్ సురేష్, కౌన్సిలర్లు గొంగళ్ళ మహేష్, చింతల రాజశేఖర్, సింగిరెడ్డి సాయిరెడ్డి, మెట్టు బాల్‌రెడ్డి, బాలగోని వెంకటేష్ గౌడ్, మోటుపల్లి పోచమ్మ, సుర్వి సుధాలక్ష్మీ, సుర్వి రవీందర్ గౌడ్, బెజ్జంకి హరిప్రసాద్ రావు, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అక్రమ్ ఆలీ, దాసరి శంకర్, మేనేజర్ నర్సింలు, టీిఆర్‌ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ళ బాలేష్, ప్రధాన కార్యదర్శులు నల్లవెల్లి శేఖర్, కొమ్ముల ప్రశాంత్, నాయకులు బోయపల్లి సత్తిరెడ్డి, బద్దం జగన్ మోహన్‌రెడ్డి, చిన్న నర్సింహ్మ గౌడ్, నర్రి కాశయ్య, సామల బుచ్చిరెడ్డి, అబ్బవతి నర్సింహ్మ, సుర్వి శ్రీనివాస్‌గౌడ్, రాఘవేందర్ రెడ్డి, జి.శేఖర్ పాల్గొన్నారు.