Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఎల్బీనగర్
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర ధరలను పెంచి పేదల జీవితాలతో ఆడుకుంటుందని రంగారెడ్డి జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి రామచంద్రం అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్ట్) మిడిల్ క్లాస్ ద్వితీయ శాఖ మహాసభ శనివారం దిల్సుఖ్నగర్లోని బోడపూడి వెంకటేశ్వర్రావు భవన్లో జరిగింది. ఈ మహా సభకు ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి రామచంద్రం హాజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతు దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు పెరిగి పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని అయన పేర్కొన్నారు. కరోనా వలన పేదల బ్రతుకులు భారం గా మారాయని, ఇదే సమయంలో నిత్యావసర ధరలు పెరగడం శోచనీయం అన్నారు. దేశంలో ఎన్నికల వలన కరోనా కేసులు పెరిగిపోయినాయి అన్నారు. సరైన సమయంలో మందులు లేక, ఆక్సిజన్ దొరకక అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మడం దారుణమని, ఇన్సూరెన్స్, రైల్వే, బ్యాంక్స్, విమాన యాన సంస్థలను విక్రయించడానికి పునుకోవడం శోచనీయం అన్నారు. కరోనా కష్ట కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోలేదని రామ చంద్రం ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలను ఎన్నికల కోసం వాడుకోవడం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తుగడగా మారింది అన్నారు. దళిత బంధు పథకం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించి వెంటనే విడుదల చేయాలని అయన కోరారు. కరోనా వలన మతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల మతి చెందిన అమర వీరులకు జోహార్లు ఆర్పించారు. ఈ సమావేశంకు టి.సత్తిరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ మహా సభలో మిడిల్క్లాస్ కార్యదర్శి శర్మ, రంగారెడ్డి జిల్లా నాయకులు చంద్రమోహన్, అంజయ్య, మల్లేష్, రాధాకష్ణ, కీసర నర్శిరెడ్డి, బ్రాహ్మచారి తదితరులు పాల్గొన్నారు.