Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని అన్ని వర్గాలకు చెందిన పేద ప్రజలకు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు కొలన్ శంకర్‌రెడ్డి వినతి పత్రం అందచేశారు. బీజేపీ బందం రాష్ట్ర పశుసంవర్ధక, సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను హైదరాబాదులోని అయన నివాసంలో కలిసి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రకటించిన దళిత కుటుంబ సాధికారత, దళిత బంధు, లాంటి పథకమును దళితులతో పాటుగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు గిరిజన, మైనార్టీ, బీసీ సామాజిక వర్గాలకు, అగ్రవర్ణాల పేదలకు అందించాలని వినతిపత్రంలో కోరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం హుజురాబాద్ ఎన్నికలలోపే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, అలాగే రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే నిరుద్యోగులతో భర్తీ చేయాలని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బీసీ రిజర్వేషన్లను అగ్రవర్ణ పేదలకు అమలు అయ్యే విధంగా చేయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మల్లికార్జున, సాయిబాబా, శ్రీనివాస్, వెంకట రమణ, మునగాల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.