Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
బాబాసాహెబ్ అంబేెద్కర్ చూపిన మార్గం ఎంతో గొప్పదని ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అవుషాపూర్ గ్రామంలో శనివారం పౌరహక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కీసర డివిజన్ సభ్యుడు తాలుక రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పౌరహక్కుల మండల చైర్మన్ మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతిథిóగా పాల్గొని మాట్లాడుతు ప్రతి ఒక్కరు డా|| బీ.ఆర్. అంబేెద్కర్ చూపిన మార్గంలోనే నడవాలని తెలిపారు. ఆయన ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసు కెళ్లాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అవుషాపూర్ గ్రామ సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చందర్రెడ్డి, ఎంఆర్ఓ విజయలకిë, ఎదులాబాద్ ఎంపీటీసీ గట్టగళ్లరవి, మాదారం సర్పంచ్ యాదగిరి, పంచాయితీ కార్యదర్శి ఉమాదేవి, విఆర్ఓ మమత, ఉపసర్పంచ్ ఐలయ్య యాదవ్, వార్డు సభ్యులు ముధ్ధం రాధ, కొలిచెలిమి మల్లేష్, వీరేశం, కోఅప్షన్ సభ్యులు మచ్చ.శ్రావణ్కూమార్, నర్సింహ్మాగౌడ్, నాయకులు బాలకృష్ణ, సాయిలు, రామ్ పాల్గొన్నారు.