Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు డా.ఎన్.గౌతమ్‌రావు అన్నారు. బాగ్ అంబర్‌పేట డివిజన్ బీజేపీ కార్యవర్గ సమావేశం శనివారం డివిజన్ అధ్యక్షుడు చుక్కా జగన్ అధ్యక్షతన ఇద్రప్రస్త కాలనీ కమ్యూనిటీ హాల్లో జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅథిóగా పాల్గొన్న డా.ఎన్.గౌతమ్‌రావు మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పార్టీని 2023లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యమత్యంతో కృషి చేయాలని అన్నారు. అనంతరం జోగులాంబ గద్వాల జిల్లా ఇన్చార్జ్ బి.వెంకటరెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందని అన్నారు. హామీల అమలులో వైఫల్యం చెందిన ప్రభుత్వం రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించకతప్పదని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి.కష్ణగౌడ్, సెంట్రల్ జిల్లా అధికార ప్రతినిధి అజరు కుమార్, సెంట్రల్ జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌లు పాల్గొని ప్రసంగించారు. సమావేశంలో బూత్ అధ్యక్షులు ఆపై స్థాయి నాయకులు, వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు.