Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
గాజులరామారం సర్కిల్ చింతల్ డివిజన్ పరిధిలోని భగత్‌సింగ్‌నగర్ కమ్యూనిటీ హాల్ వెనుకాల ఉన్న నాలా ప్రహరీ నిర్మాణాన్ని అసంపూర్తిగా వదిలేశారని, సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర జై గౌడ్ ఉద్యమం కార్యదర్శి బీసు వెంకటేశంగౌడ్ శనివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ను చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా నాలాలు నిండి వరద నీరు ఇండ్లలోకి చేరే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రహరీ లేకపోవడంతో చిన్న పిల్లలు అందులో పడే ప్రమాదం ఉందని సమస్యను అధికారులకు, కాంట్రాక్టర్‌కు, కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లడంతో బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే తన సొంత నిధులతో నాలా ప్రహరీని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన బస్తీ వాసుల తరుపున ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మధుగౌడ్, బి.శ్రావణ్‌కుమార్, మహేష్, నరేష్ పాల్గొన్నారు.