Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని బంజారాహిల్స్ ఏసీపీ ఎం సుదర్శన్, ఇన్స్పెక్టర్ శివ చంద్ర అన్నారు. నగర వ్యాప్తంగా బోనాల కోలాహలం కనబడుతోంది. ఈమేరకు ముందస్తుగా రౌడీ షీటర్ల్కు అవగాహన కల్పించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్పెషల్ పోలీసులు పహారాలో కొనసాగుతాయని తెలిపారు. సెషల్ పోలీసు బలగాలు సహకారంతో ప్రతి సెక్టార్ ఎస్ ఐ 20 నుంచి 50 పోలీసుల సహకారంతో పోలీస్ స్టేషన్ పరిధిలోని మొత్తం 48 ఆలయాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమస్యాత్మక ప్రాంతాలు బంజారాహిల్స్ గౌరీ శంకర్, ఫిల్మ్ నగర్,ఇంద్రణగర్, ఎన్బీటీ నగర్, దేవర కొండ బస్తీ, ఎన్బీ నగర్ ప్రాంతాల్లో జగదాంబిక అమ్మవారి గోల్కొండ బోనాలతో ప్రారంభమైన సందడి ఇంకా కొనసాగుతున్ఱే వుంది. లష్కర్ బోనాలు ప్రశాంతంగా ముగియడంతో ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ బోనాల జాతరపై పోలీసులు నిఘా పెట్టారు.శాంతి భధ్రతలకు ఎలాంటి విఘాతం ఏర్పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.