Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
దళిత బంధును అడ్డుకునేందుకు విపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన పథకం ఆగే ప్రసక్తే లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు ప్రవేశపెడితే అడ్డుకునేందుకు ఇతర పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా దళితుల సంక్షేమం విషయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద జల్లాలనే ప్రయత్నాలు మానుకుంటే మంచిదన్నారు. అట్టడుగు వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేస్తున్న పథకాలు అమలు అయ్యేలా సహకరించాలన్నారు.