Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
కరోనా కాటుకు ఎంతో మంది ప్రాణాలు కొల్పోవడం చాలా బాధాకరమని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం గాజులరామారం డివిజన్ ఉషోదయకాలనీలోని ప్రయివేట్ పాఠశాల కరస్పాండెంట్స్ అసోసియేషన్ హాల్లో ట్రస్మా కుత్బుల్లాపూర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై కరోనాతో మృతిచెందిన కరస్పాండెంట్స్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. మృతి చెందిన ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు, ట్రస్మా మేడ్చల్ జిల్లా బడ్జెట్ పాఠశాలల యజమాన్యాల సంఘం అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి మధుసూధన్, వనజా అశోక్, నర్సిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, వరప్రసాద్, శివయ్య, మల్లేశం, ముఖ్య సలహదారులు యం.శ్రీనివాస్‌గౌడ్, మహేష్‌కుమార్, కిషన్‌రావు, శ్రీనివాస్‌చారి, పవన్, చాయాదేవి, శభానా, తిరుపతిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు, వివిధ పాఠశాలల, బడ్జెట్ పాఠశాలల యజమాన్యాలు తదితరులు పాల్గొన్నారు.