Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఓయూ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎల్ఎస్ఓ, జీఎస్ ఆధ్వర్యంలో శనివారం వీసీ ప్రొఫెసర్ రవీందర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఓయూ పీహెచ్డీ నోటిఫికేషన్ విడుదల చేయక నాలుగేండ్లు అవుతుందని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఈవిషయంలో వీసీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. యూజీసీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రవి నాయక్, ఏఐఎస్ఎఫ్ క్రాంతి, ఎల్ఎస్ఓ అశోక్, గిరిజన సంఘం శరత్ నాయక్, ప్రసాద్ నేతకాని, నాయకులు విజేందర్ పవర్, కరణ్, నరేష్, అఖిల్ పాల్గొన్నారు. -