Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హరితహారంలో విధిగా పాల్గొనాలి
- కౌన్సిలర్ షేక్ పమీద అప్జల్
- వాదిహే ముస్తఫా కాలనీలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ
నవతెలంగాణ-బడంగ్‌పేట
మొక్కలు కాలుష్య నివారణకు ఎంతో ఉపయోగ పడుతాయనీ, నాటిన ప్రతి మొక్కనూ రక్షించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని కౌన్సిలర్ షేక్ పమీద అప్జల్ అన్నారు. శనివారం జల్పల్లి మున్సిపాల్టీ పరిధిలో ఉన్న 21వ వార్డుల్లోని వాదిహే ముస్థాఫా కాలనీలో కౌన్సిలర్ ఇంటింటికీ తిరిగి మొక్కలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లా డుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు
విధిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశం మేరకు ప్రభుత్వ స్తలాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సయ్యద్ హుసేన్, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.