Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
కాప్రా డివిజన్ గాంధీనగర్‌లోని చాలా మంది ప్రజలు కోవిడ్ మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకోలేదనీ, వాక్సిన్ సెంటర్లలో కేవలం రెండో డోసు మాత్రమే అందుబాటులో ఉందనీ, మొదటి డోస్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు బి.శివరామకృష్ణ, గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి.సత్య నారాయణ కోరారు. ఈ మేరకు శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు సంపత్‌కుమార్, స్వప్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రయి వేటు ఆస్పత్రిలో వ్యాక్సిన్‌కు ధర అధికంగా ఉందనీ, పేద, బడుగు ప్రజలు కొనుక్కొని వాక్సిన్ చేయించు కోలేరనీ, వీలైనంత త్వరలో మొదటిడోసు కొవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చి బస్తీ వాసులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు బి.మోహన్, ఎం.కనకరాజు, రాజు, మురళి, తదితరులు పాల్గొన్నారు.