Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట
బీహార్ రాష్ట్రంలోని బగల్పూర్ తమను ఆదుకోవాలని వచ్చిన ఒక ఫోన్ కాల్, తండ్రి కూతురును కదిలించింది. రూ.లక్షలు ఖర్చు కానీ ఒక చేయి మనం వేస్తే వంద చేతులు తోడపు తాయి అనే మనో సంకల్పం వారిని ముందుకు నడిపించింది. వారి సంకల్పం ముందు రూ. లక్షలు చిన్నవైపోయాయి. మానవత్వం ఉన్న వారందరూ మేమున్నామని ముందుకు వచ్చా రు. సోనూనూర్ ఫౌండేషన్ వీరికి తోడైంది. ఫలితంగా ఓ పేద వ్యక్తికి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. బోయిన్ పల్లికి చెందిన మనోజ్ రహీజా మనసున్న వ్యాపారి. ఆయన కుమార్తె సంజనజహి బటీ ప్రాఫిషనల్ కరోనా సెకండ్ వేవ్ వస్తే పేద, మధ్య తరగతి ప్రజలు బెడ్లు లేక, ఆక్సిజన్ అందక వైద్యం అందక విలవిల్లాడుతూ ఉంటే వీరి మనసు చలించి పోయింది. తముకు తోచిన దానితో పాటు దాతల సహకారంతో ఎంతో మందికి ఉచితంగా బెడ్లు, ఆక్సిజన్ కాంగ్రన్స్టే టర్లు, వెంటిలేబర్వి ఆక్జిజన్ సిలిండర్లు అందిం చారు. ప్లాస్మా అవనరం ఉన్న వారికి దాతలను వెతికి ప్లాస్మా ఇప్పించారు. ఇలా వీరు చేస్తున్న సేవలు ఇతర రాష్ట్రల వరకు వరకు విస్తరిం చాయి. ఇదే క్రమంలో సంజన రహేజాకు బీహా ర్లోని బగల్పూర్కు చెందిన షానూ కుమారి నుంచి ఫోన్ వచ్చింది. తన తండ్రి కై ప్రకాశ్ షా (51) కు లివర్ పాడైపోయిందనీ, కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స తప్ప మరోమార్గం లేదని చెప్పింది. కాలేయ మార్పిడికి రూ.లక్షల్లో ఖర్చు అవుతుండ టంతో తాము భరించే స్థితిలో ఉన్నామనీ, హైదరాబాద్లోని ఓ ప్రయివేటు అస్పత్రిలో చికిత్సతో ప్రాణాలు నిలబెట్టుకుంటూ వస్తున్నా మని ఆమె తెలిపింది. వెంటనే సంజన ఈ విషయాన్ని తండ్రి మనోజ్యకు తెలిపింది. ఇద్దరూ కలిసి ఎలాగైనా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేయించి అతని ప్రాణాలు కాపాడాలని ఆలో చించారు. వారిని జూన్ 12వ తేదీన ప్టైట్ చార్జీలు చెల్లించి హైదరాబాదుకు రప్పించారు. స్నేహితుడు అనిల్ రాజాని తన డబుల్ బెడ్ రూమ్ ప్లాట్ వీరు బస చేసేందుకు ఉచితంగా అందించగా, నిత్యావసర వస్తువులు సమకూర్చా రు. అటు తర్వాత సోనూసూద్ ఫౌండేషన్లో మాట్లాడగా జాబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు. అక్కడకు వెళ్లి డాక్టర్ మనీష్ వర్మను కలువగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు రూ.23 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. మనోజ్ రవేిజా, మన బంధువులు, తెలిసిన వారు, స్నేహితుల వద్ద శస్త్ర చికిత్స కోసం నగదును సేకరించారు. సోమూనూద్ ఫౌండేషన్ మరింత ఆసరగా నిలిచి నగదును సమకూర్చింది. జై ప్రకాశ్షా కుమారుడు తన కాలేయాన్ని దానం చేసేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 25 రోజుల పాటు అన్ని రకాల పరీక్షలు అయిన తర్వాత జూలైలో అయ నకు కాలేయ మార్పిడి శస్త చికిత్స అపోలో వైద్యులు పూర్తి చేశారు. జాలై 13వ తేదీన కాలేయ దాతైన జై షా పూర్తిగా కోలుకున్నారు. 14 రోజుల తర్వాత జై ప్రకాశ్ కూడా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు.