Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎం.వినోద
- ఐద్వా కాప్రా సర్కిల్ సహాసభ
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
బీజేపీ అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందనీ, మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుతున్నా యని ఐద్వా మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎం.వినోద అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మేడ్చల్ జిల్లాలో కాప్రా సర్కిల్ మహాసభ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాప్లో బియ్యంతోపాటు 14 రకాల నిత్యా వసర వస్తువులు ఇవ్వాలనీ, కేరళ, తమిళనాడులో 14 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలు ఉపాధిని కోల్పోయా రనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అర్హులైన వారందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని వాగ్దానం చేసినట్టు తెలిపారు. ఇండ్లు అందరికీ ఇవ్వాలనీ, పొదుపు గ్రూపులో ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి అమలు చేయడం లేదన్నారు. బ్యాంకు వాళ్లు చక్రవడ్డీ వేస్తున్నారనీ, పొదుపు గ్రూపు మహిళలు ఇబ్బంది పడుతున్నారనీ, భవిష్యత్లో ఈ సమస్యల మీద ఐద్వా కాప్రా సర్కిల్ కమిటీ దృష్టి సాధిస్తుందనీ, పోరాటాలు చేసి ప్రభుత్వాలను నిలదీస్తామని హెచ్చరించారు. కాప్రా సర్కిల్ 15 మంది మహిళలతో నూతన కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు భీమిరెడ్డి ధనలక్ష్మి, సఫియ సుల్తానా, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.