Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నిబంధనల ప్రకారం భూమి కోనుగోలు చేసినా తమ భూమిలోకి ఇతరులు వచ్చి దౌర్జ న్యం చేయాలని చూస్తున్నారనీ, ఇది న్యాయం కాదని బోడుప్పల్‌కు చెందిన భాధితులు మీడి యా ముందు వాపోయారు. భాధితుల వివరాల ప్రకారం బోడుప్పల్ కార్పోరేషన్ పరిధిలో నివా సం ఉండే తోటకు భిక్షపతి తన భార్య రాధామ్మ పేరుతో 2002లో పట్టాదారులు భిక్షాలు రావ్ వద్ద న్యాయబధ్దంగా అన్ని నిబంధనలు పాటించి పట్టాదారుల నుంచి కీసర దాయార రెవిన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 254లో ఆరు ఎక రాల భూమిని కోనుగోలు చేశామన్నారు. కోను గోలు చేసినప్పటి నుంచి ప్రస్తుతం వరకు భూమి తమ ఆదీనంలోనే ఉంటుందని తెలిపారు. గతంలో స్థానికులతో చిన్న చిన్న సమస్యలు వస్తే కోర్టును ఆశ్రయించి అర్దర్ కూడా పొందామనీ అదే స్థలంలో భూమికి రక్షణగా పెన్షింగ్ నిర్మా ణం చేపడితే మీరు కబ్జా చేశారని ఆరోపణలు చేయడం సరి కాదన్నారు. తాము కష్టపడి కోను గోలు చేసిన భూమిలో ఇతరులు వచ్చి దౌర్జన్యం చేయాలని చూస్తే ఉరుకునే ప్రసక్తి లేదన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వేచేసి తమ భూమి సరిహద్దు చూపించాలని కోరారు. ఇక్కడ తమకు సంబంధించిన భూమి తప్ప ఇతరుల భూమిలో సెంటు భూమి అక్కర లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాధమ్మ కుమారులు తోట రవిందర్ యాదవ్, సురేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, విజరు కుమార్ యాదవ్ పాల్గొన్నారు.