Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
- శ్రీనగర్ కాలనీలో పౌరహక్కుల దినోత్సవం
నవతెలంగాణ-ఏఎస్రావు నగర్
సమాజంలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో మెలగాలని మేడ్చల్ అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి కోరారు. కాప్రాలోని శ్రీ శ్రీ నగర్ కాలనీలో పౌర హక్కుల దినోత్సవాన్ని తహశీల్దార్ కె. గౌతమ్ కుమార్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు, వెనుక బడిన తరగ తులకు చెందిన వర్గాల ప్రజలు విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారని తెలి పారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే సదుపాయాలను వినియోగి ంచుకోవాలని సూచించారు. కింది స్థాయి వర్గాల పట్ల చిన్న చూపు తగదన్నారు. ఎస్సీ, ఎస్సీ చట్టం పని తీరును, రాజ్యాంగం ప్రకారం ఇచ్చిన హక్కుల పరిరక్షణ స్థానికంగా ఎలా అమలు అవుతుందని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రజలతో వివిధ సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి వినోద్ కుమార్, కుషాయిగూడ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అనంత్చారి, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, రాజు వస్తద్, సంతోష్, నికెనర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు బద్రుద్దీన్, కుమార్, బీజేపీ నాయకులు మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.