Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్‌నగర్
మేడ్చల్ జిల్లా కేంద్రంలోని శామీర్‌పేటలో పని చేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇంటి అద్దెలు తగ్గించడం సమంజసం కాదని మేడ్చల్ జిల్లా ఎస్టీయూ అధ్యక్ష కార్యదర్శులు బి.వెంకటేశ్వర్లు, ఎస్.పాండురంగారెడ్డి అన్నారు. వేతన సవరణలో భాగంగా ఇచ్చిన ఉత్తర్వుల సంఖ్య 53లో శామీర్‌పేటను మేడ్చల్ జిల్లా కేంద్రంలోని హెచ్ఆర్ఏను 13 శాతంగా నమోదు చేశారనీ, గతంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు శామీర్‌పేట గ్రేటర్ హైదరాబాద్‌కు 8 కిలోమీటర్ల పరిధిలో ఉండటంతో జీహెచ్ఎంసీకి రావాల్సిన హెచ్ఆర్ఏ ఇచ్చేవారని తెలిపారు. నూతన పీఆర్సీలో శామీర్‌పేట్ అవతల ఉన్న గ్రామాలకు 24 శాతం ఇంటి అద్దె చెల్లిస్తూ, శామీర్‌పేటకు మాత్రం 13 శాతం చెల్లిస్తామని అనడం దారుణం అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో గతంలో ఉన్న 8 కిలోమీటర్ల పరిధిని అలాగే కొనసాగించాలని స్పష్టంగా సూచించారని వారు తెలిపారు. తక్షణమే శామీర్‌పేటలో పని చేస్తున్న ఉపాధ్యాయ, ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మేడ్చల్ జిల్లా కేంద్రంలోని శామీర్పేట్ను గుర్తించినందుకు అక్కడి నుంచి 8 కిలోమీటర్ల పరిధి వర్తింపజేస్తూ మిగతా గ్రామాలకు 13 శాతం హెచ్ఆర్ఏను చెల్లించే విధంగా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు రామకృష్ణారెడ్డి, లక్ష్మణమూర్తి, శివాజీ, పుల్లారావు, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.