Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-ఓయూ
బహుజన రాజ్యం దిశగా ప్రతీ ఉపాధ్యాయుడు ప్రజలను చైతన్యం చేయాలని పూలే, అంబేద్కర్, కాన్షీరాం ఆశయ సాధకులు, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. శనివారం ఓయూ మెకాస్టార్ ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల విస్తృత స్థాయిసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాలలు, యూనివర్సిటీలు ఎదగకపోవడానికి కారణం పాలక వర్గాల వైఫల్యం అన్నారు. ఇది పోవాలంటే బహుజన రాజ్యం రావాలన్నారు. గత ఏడేండ్ల పాలనలో గుర్తుకురాని దళిత బంధు హుజురాబాద్ ఎలక్షన్లు రావడంతో గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. దళిత బంధు పేరుతో ఖర్చు చేసే వెయ్యి కోట్లతో రూ.2 లక్షల విద్యార్థులకు ల్యాప్టాప్లు, ఆన్లైన్ క్లాసులు వినడానికి మొబైల్స్, 40 వేల మంది ఉపాధ్యాయ నోటిఫికేషన్ విడుదల చేయవచ్చు అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న విద్యార్థుల త్యాగాలు వృథా కానివ్వకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ బహుజన రాజ్యం వైపు ప్రజలను చైతన్యం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఉద్యోగంతో పాటు ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తే బహుజన రాజ్యం తప్పకుండా వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.