Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టౌన్ ప్లానింగ్, విజిలెన్స్, టాస్క్ఫోÛర్స్ అధికారులు వున్నా అక్రమ నిర్మాణాలు తగ్గడం లేదు
- అక్రమ నిర్మాణాలు చేపడితే 200 శాతం జరిమాన విధించారా?
నవతెలంగాణ-హయత్‌నగర్
హయత్‌నగర్ సర్కిల్ పరిధిలో గత ఏడాది నుండి కరోనా ఉన్నందున చాలా చోట్ల పాత నిర్మాణాలపై ఒకటికి మించి మరో అంతస్తులు నిర్మిస్తున్నారు. ముఖ్యంగా టౌన్‌ప్లానింగ్ అధికారులు కరోనా వేళ బిజీగా ఉన్నందున అక్రమ నిర్మాణాలు కొనసాగుతు న్నాయి. ముఖ్యంగా మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో లే ఔట్ ఏర్పాటు స్థలంలో ప్రస్తుతం నిర్మాణం చేపడుతున్నారు. ఆగమయ్యనగర్ కాలనీలో అదనపు నిర్మాణంతో పాటుగా కమర్షియల్‌గా నిర్మాణం, వీరభద్ర కాలనీ, బందావనం కాలనీ, లెక్చరర్ కాలనీ, మధురానగర్ కాలనీ, పవనగిరి కాలనీల్లో అధికంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. అదేవిధంగా హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని సాక్షాత్తూ అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్ సోషల్ మీడియా వేదికగా అధికారులను హెచ్చరించినా చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరం. తాము ఫిిర్యాదు లు చేసినా అధికారులు స్పందించడంలేదని ప్రస్తుత కార్పొరేటర్లు సైతం ఆవేదన చెందుతున్నారు. టౌన్‌ప్లానింగ్ పనితీరు మెరుగ్గా లేదని జీహెచ్ఎంసి కమిషనర్ టాన్ కొత్త టీం ఏర్పాటు చేసిన, విజిలెన్స్ అధికారులు వున్నా చర్యలు అంతంత మాత్రమే అని కేవలం మున్సిపల్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్టర్ ద్వారా ఫిిర్యాదు వస్తేనే స్పందిస్తున్నారని కొందరు అధికారులపై మండిపడుతున్నారు. ఒక్క హయత్ నగర్ సర్కిల్ పరిధిలోనే ఏటా కోట్ల రూపాయల నష్టం జీహెచ్ఎంసికి వాటిల్లుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా అక్రమ నిర్మాణం చేపట్టిన వారికి 200 శాతం పెనాల్టీ విధించారా అని ప్రశ్నించారు. చూడాలి మరి తూతూ మంత్రాంగ కాకుండా పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని చూడాలి మరి...
అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటాం :
టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఈర్షద్ అక్రమ నిర్మాణాలు హయత్ నగర్ సర్కిల్ పరిధిలో ఉన్నట్లు మా దష్టికి వస్తే వెంటనే కూల్చి వేస్తాం. కొందరికి నోటీసులు కూడా జారిచేసాం. లిఖిత పూర్వకంగా ఫిిర్యాదు చేసినా చర్యలు తెరసుకోలేదు: పిర్యాదు దారుడు సిద్దు అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ కార్యాల యంలో ఫిర్యాదు లిఖిత పూర్వకంగా చేసిన ఇప్పటికి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ఫిర్యాదు దారుడు సిద్దు అధికారులపై మండి పడ్డారు. కేవలం ట్వీట్టర్కే స్పందిస్తే మిగతా వారికి న్యాయం జరగదు కదా అని అన్నారు.