Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి
- ఎస్వీకేలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఐదో వార్షిక సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-రాంనగర్
కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ మంత్రిత్వశాఖ లేకపోవడం బాధాకరమని జాతీయ బీసీ కమిషన్ సభ్యులు టి.ఆచారి అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఐదో వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.కిరణ్ కుమార్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టి.ఆచారి మాట్లాడుతూ ఓబీసీ ఉద్యోగులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. పూర్తి సమాచారంతో తనకు అందిస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలు, లా కళాశాల్లో ఓబీసీ రిజర్వేషన్ సాధించామనీ, ఎంతో మంది ఓబీసీ విద్యార్థులకు కు ప్రయోజనం చేకూరిందనీ, ఈ ఘనత ఓబీసీ కమిషన్‌కు దక్కిందన్నారు. కేంద్రంలో ఉన్న జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్‌కు కేటాయించిన బడ్జెట్ కన్నా జాతీయ బీసీ కమిషన్‌కు చాలా తక్కువ అనీ, గతంలో కమిషన్‌కు కేవలం రూ.ఆరు కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండేదనీ, ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ను రూ.12 కోట్లకు పెంచుకోగలిగామని తెలిపారు. బీసీల హక్కుల కోసం నిరంతరం తామసం ఇస్తున్నామనీ, వారి హక్కులను కాలరాస్తే మాత్రం ఏ మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఓబీసీలో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఓబీసీ ఉద్యోగులకు అందరికీ జాతీయ బీసీ కమిషన్ నిరంతరం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి.కరుణానిధి, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జి.నాగదర్, ఏఐఆర్‌ఆర్‌బీఈఏ సెక్రెటరీ జనరల్ ఎస్.వెంకటేశ్వర్‌రెడ్డి, టీజీబీఓఏ ప్రధాన కార్యదర్శి ఎంవీపీ రాజకుమార్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఆకుల బాపు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి జి.తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.