Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీఎం సహాయనిధి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి గుర్రంగూడ గ్రామా నికి చెందిన పార్వతి అనే మహిళకు మంజూరైన రూ. 30వేల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్ర మంలో కో-ఆప్షన్ సభ్యలు జ్యోతి, అశోక్, టీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. .