Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎల్జీ ఆస్పత్రి ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సువర్ణరారు
- 1 నుంచి 7వ తేదీన వరకు తల్లిపాల వారోత్సవాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
డబ్బా పాలు వద్దు.. తల్లి పాలే ముద్దని ఎస్ఎల్జీ ఆస్పత్రి ప్రముఖ గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ డాక్టర్ సువర్ణరారు తెలిపారు. తల్లిపాల విశిష్టతను తెలిపేందు కు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నేడాదీ ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా నిర్వహిస్తున్నారు. వాబా (వరల్డ్ అలైన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్యాక్షన్) సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యూహెచ్ఓ, యూనిసెఫ్, బీపీఎన్ఐ వంటి అంతర్జా తీయ, జాతీయ సంస్థల అనుబంధంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా రారు మాట్లాడుతూ 'ఈ ఏడాదికిగాను తల్లిపాల వారోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమ య్యాయి. పుట్టిన పసిపిల్లలకు శక్తితో పాటు, శారీరక అనా రోగ్య సమస్యలు, మానసిక పరమైన సమస్యలను తల్లి పాలు దరిచేరనియ్యవు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వకుంటే భవిష్యత్‌లో పలు విధాలైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. నవజాత శిశువులకు తల్లిపాలు అమత తుల్యమైనవి. ప్రకృతి ప్రసాదించిన అత్యత్తుమ పౌష్టికా హారం తల్లి పాలే. సంపూర్ణ ఆరోగ్యం పిల్లలు పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం తప్పనిసరి. పిల్లలకు తల్లి పాలు పట్టడం వల్ల రోగ నిరోధక శక్తి పెంపొందుతోంది. బిడ్డకు ఏ వయసు వచ్చే వరకు తల్లిపాలు ఇవ్వాలి? రోజుకు ఎన్నిసార్లు ఇవ్వాలి? ముర్రుపాలు ఎప్పుడు ఇవ్వాలి? తదితర అంశాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కోసమే ఈ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.' తల్లి పాల సంస్కతిని రక్షించుకుందాం' అనే అంశాన్ని ఈ ఏడాది థీమ్‌గా తీసుకున్నారు. పాలిచ్చే తల్లులు కూడా అధికంగా బరువు పెరగకుండా, ఒబేసిటీ బారిన పడకుండా ఉంటారు. పిల్లలకు పాలిచ్చిన వారిలో రొమ్ము క్యాన్సర్ల ముప్పు, డిప్రెషన్ సమస్య తగ్గుతుంది. పాలు ఇవ్వడం వల్ల పిల్లలకే కాకుండా తల్లులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది' అంటూ వారు సందర్భంగా వివరించారు.