Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
రానున్న ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివద్ధి సంక్షేమ పథకాలకు ప్రజలు అకర్షితులై బీజేపీలో చేరుతున్నారని రాష్ట్ర కార్యదర్శి, మహేశ్వరం నియోజక వర్గం ఇన్చాÛర్జి అందేల శ్రీరాములు యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ దేశం, ధర్మం కోసం చేస్తున్న అభివద్ధిని చూసి బడంగ్‌పేట వాసులు బీజేపీలో చేరారన్నారు. బడంగ్‌పేట కార్పొరేషన్ 1వ డివిజన్ సాయి గోకుల్ నివాస్‌కు చెందిన పలువురు ప్రముఖులు స్వచ్ఛందంగా కాషాయం కండువాలు కప్పుకున్నారు. కార్పొరేటర్ అనితా ప్రభాకర్, బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగుడెం రామకష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజ కవర్గం బీజేపీ ఇన్‌ఛార్జి శ్రీరాములు యాదవ్ హాజరై పార్టీలో చేరుతున్న వారికి కండువాలు కప్పి అభినందిం చారు.ఈ సందర్బం గా అయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు హిందూ సమాజం కోసం ఎంతో కషి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మేధావులు, సామాజిక కార్యకర్తలు, ఇతర పార్టీల నాయకులు కమలదళంలో చేరుతున్నారని తెలిపారు. ఏడేళ్ల పాలనతో టీఆర్ఎస్ సర్కారు తిరోగమనం దిశ పట్టిందన్నారు. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి, రాష్ట్ర నాయకులు సామ సంజీవరెడ్డి, నడికుడి యాదగిరి, స్థానిక బీజేపీ, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.