Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
బహుజన రాజ్యం కోసం పోరాడుదామని గిరిజనశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ వెంకటేష్ చౌహాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శరత్ నాయక్ అన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో గిరిజన శక్తి రాష్ట్ర స్థాయి విస్తత సమావేశం నిర్వహిం చారు. ట్రైబల్ యూనివర్సిటీ, గిరిజన రిజర్వేషన్ పెంపుదల, బహుజన రాజ్య స్థాపన, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై విస్తతంగా చర్చించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాలపై రాబోయే కాలంలో కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఆయనతో కలిసి పనిచేయడానికి గిరిజన శక్తి సిద్ధంగా తెలిపారు. కార్యక్రమంలో గోర్ మాటి సినిమా డైరెక్టర్ శంకర్ జాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జ్యోష్న, ఉపాధ్యక్షులు భరత్ నాయక్, కార్తీక్ నాయక్, ఓయూ అధ్యక్షుడు సిద్ధార్థ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి మోహన్ నాయక్, వెంకటేష్ నాయక్, మధు, సంతోష్, అజరు, రాజేష్, లింగ, భాస్కర్, మహేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.